కలకడ మండలంలో పొంచి ఉన్న పెను ప్రమాదం

74చూసినవారు
కలకడ మండలం ఒంటిల్లువారిపల్లె వద్ద గల పంట పొలాల్లో 3 ఫేస్ విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నట్లు స్థానిక రైతు రామకృష్ణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. శనివారం ఆయన మాట్లాడుతూ చేతికి అందే ఎత్తులో ఉన్న తీగలతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని ఆందోళనగా ఉందన్నారు. పలుమార్లు తాము అధికారులకు తెలిపినా వారు స్పందించలేదని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్