గుర్రంకొండలో కదిరాయచెరువు క్రాస్ రోడ్, ఏనుగు చెరువు కట్ట వద్ద వేస్తున్న వ్యర్థ పదార్థాలు కారణంగా విపరీతమైన దుర్వాసన వలన దారిలో వస్తున్న రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దీనికి పరిష్కారం మార్గం చూపాలని మండల సచివాలయం మరియు పోలీస్ స్టేషన్లో కూటమి నాయకులు వినతి పత్రం శుక్రవారం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రామాంజులు, భరత్, కిషోర్, రెడ్డిశేఖర్, రెడ్దిరాజా, బాబు, రామాంజి పాల్గొన్నారు.