ఆయుష్మాన్
భారత్ కార్డు పేదలకు ఆరోగ్యవరం లాంటిదని గుర్రంకొండ మండలం చెర్లోపల్లి గ్రామం నందు జరిగిన వికసిత్
భారత్ సంకల్ప యాత్ర నందు అన్నమయ్య జిల్లా బిజెపి అధ్యక్షుడు సాయి లోకేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఖరీదైన వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తెచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో పీలేరు బిజెపి అసెంబ్లీ కన్వీనర్ పొత్తూరి శ్రీకాంత్, స్థానిక గ్రామ అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.