కలికిరి నందు రోడ్లు మరియు భవనాల శాఖ అతిథి గృహంలో మాజీ సిఎం, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని శనివారం గుర్రంకొండ మండలం బిజెపి నాయకులు కలిశారు. నల్లారి కిరణ్ మాట్లాడుతూ మండలంలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు టిసి రెడ్డన్న, గుర్రంకొండ మండలం బిజెపి అధ్యక్షులు రామాంజులు, గోపాల్ రెడ్డి, చింతిర్ల శ్రీనివాసులు, గౌరీ హోటల్ శ్రీనివాసులు పాల్గొన్నారు.