బిజెపి కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు గుర్రంకొండ మండలంలోని ప్రతి పల్లెకు బిజెపి నాయకులు వెళ్లి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పధకాలను తెలియజేయాలని గుర్రంకొండ మండలం కేంద్రలోని మహేంద్ర మర్రి నందు జరిగిన సమావేశంలో అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్ గజపతి రాజు కోరారు. ఈ సందర్బంగా మండల అధ్యక్షులు రామాంజులు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.