ప్రొద్దుటూరు మండలం చెన్నమరాజుపల్లెలో గురువారం పూజలు ఘనంగా జరిగాయి. దేవుడిని ఊరేగిస్తున్న సందర్భంలో ఓ ఇద్దరు అమ్మాయిలు కర్ర సాము చేశారు. వారి విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అంతరించిపోతున్న కర్ర సామును చిన్నపిల్లలు చేయడం అభినందనీయమని అందరూ కొనియాడారు.