ప్రొద్దుటూరు: వేమన జయంతి.. పోటీల విజేతలకు బహుమతులు

58చూసినవారు
ప్రొద్దుటూరు: వేమన జయంతి.. పోటీల విజేతలకు బహుమతులు
ప్రొద్దుటూరు శివాలయంలో ఆదివారం వేమన జయంతి సందర్భంగా విద్యార్థులకు వేమన పద్య పఠనం, వ్యాసరచన, చిత్రలేఖన పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందించారు. వేమన సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమంలో ఎంఈఓ సావిత్రమ్మ మాట్లాడుతూ నేటి తరం పిల్లలు వేమన సాహిత్యాన్ని నేర్చుకుని భావాన్ని గ్రహించి పాటించాలన్నారు. సమితి గౌరవ అధ్యక్షులు డాక్టర్ నాగదస్తగిరి రెడ్డి, శెట్టిపల్లె రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్