ప్రొద్దుటూరు: చంద్రబాబు పాలనపై ధ్వజమెత్తిన తులసి రెడ్డి

79చూసినవారు
చంద్రబాబు పాలనలో ఇచ్చేది గోరంత, లాక్కునేది కొండంతని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం ప్రొద్దుటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ. ఉచిత గ్యాస్ పథకం కింద ఏడాదికి రూ. 2, 684 కోట్లు ఇచ్చి. కరెంటు సర్దుబాటు చార్జీల పేరుతో రూ. 15, 485 కోట్లు ప్రజల నుంచి వసూలు చేస్తున్నారన్నారు. సూపర్ 6 పథకాలలో చాలా వరకు అమలు కావడం లేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు.

సంబంధిత పోస్ట్