తిరుమల లడ్డును అపవిత్రం చేస్తే సహించబోమని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గాలిహరిప్రసాద్ పేర్కొన్నారు. శనివారం ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి వేంపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై తిరుపాల్ నాయక్ కి వినతిపత్రం అందజేశారు. శ్రీవారికి ప్రీతి పాత్రమైన లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వుతో కల్తీ నెయ్యి, చేప నూనెను వినియోగించారని వస్తున్న కథనాలు హిందువుల మనోభావాలు తీవ్రంగా కలచివేస్తోందన్నారు.