పులివెందుల బ్రాంచ్ కెనాల్ ద్వారా వేంపల్లె
మండలంలోని పాములూరు, కత్తులూరు, అయ్యవారిపల్లి, అమ్మగారిపల్లి గ్రామాలకు సాగు, తాగు నీరును బుధవారం విడుదల చేశారు. ఈ విషయాన్ని వేంపల్లె మండల టీడీపీ కన్వీనర్ రామముని రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో. నీటి లభ్యత తగ్గి బోర్లు ఇంకిపోయాయని అన్నారు. నీరు విడుదల కావడంతో ఆ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేశారు.