చక్రాయపేట మండలం గండి క్షేత్రంలో శ్రావణ మాస మహోత్సవాల సందర్భంగా రూ. 1, 59, 90, 540 ఆదాయం వచ్చినట్టు ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు. సేవ టికెట్లు, లడ్డు ప్రసాదాల, ప్రసాద కవర్లు, రూముల బాడుగలు, షాపింగ్ కాంప్లెక్స్, వివాహ కట్టడి, శాశ్వత హుండీలు, అన్నదానం విరాళం, మనీ ఆర్డర్ ద్వారా ఆదాయం వచ్చిందన్నారు. నాలుగు శ్రావణ శనివారం మహోత్సవాల ద్వారా ఈ ఆదాయం వచ్చిందని ఆలయ కమిషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు.