ప్రజలకు ప్రాణం పోసే డాక్టర్లను గౌరవించాలి తప్ప వారిపై పాసవికంగా దాడులు చేయడం, హత్య చేయడం క్షమించరాని నేరమని చిట్వేలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ మహమ్మద్ వకీల్ అన్సారీ అన్నారు. శనివారం అంగన్వాడి కార్యకర్తలు, ఉపాధ్యాయులు చిట్వేలి లో డాక్టర్ మౌమీత హత్యాచారానికి నిరసనగా కొవ్వత్తుల ప్రదర్శన నిర్వహించారు. మహిళలు ఉద్యోగం చేసే చోట రక్షణ కల్పించాలని ఐసిడిఎస్ సిడిపిఓ రాజేశ్వరి అన్నారు.