పుల్లంపేట మండలంలోని మోడల్ స్కూల్ వద్ద మంగళవారం కడప - తిరుపతి జాతీయ రహదారిపై మోటారు బైకులు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనలో అనంతం పల్లికి చెందిన శేఖర్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తులను రాజంపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తుల పరిస్థితి తెలియాల్సి ఉంది.