ప్రజలకు మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేస్తున్నాం

58చూసినవారు
ప్రజలకు మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేస్తున్నాం
ప్రజలకు మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేస్తున్నామని, చిన్న ఓరంపాడు లోని జూనియర్ కళాశాలలో సిమెంట్ రహదారి నిర్మాణం పూర్తి చేసామని రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి బాధ్యులు ముక్కా రూపానందరెడ్డి అన్నారు. ఓబులవారిపల్లె మండలం చిన్న ఓరుంపాడులో ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామానికి రహదారుల నిర్మాణం కోసం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేశామని, త్వరలో పనులు మొదలు పెట్టడానికి తగు ఏర్పాట్లను చేస్తున్నామని అన్నారు.