అటల్ బిహారీ వాజపేయి వర్ధంతి సందర్భంగా శుక్రవారం అన్నమయ్య జిల్లా నందులూరు మండలంలోని అరవపల్లి గ్రామం ఆర్ అండ్ బి బంగ్లా వద్ద అటల్ బిహారీ వాజపేయి చిత్రపటానికి పూలమాల వేసి ఎన్డీయే నాయకులు నివాళులు అర్పించారు. తెదేపా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ దేశానికి తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు.