సుండుపల్లె మండలంలోని పెద్ద బలిజ పల్లె, మలక్కగారి పల్లె రహదారి మధ్యలో వెలసిన శ్రీ సిద్దేశ్వర స్వామి, కూటాలమ్మ దేవాలయాల వద్ద శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రత పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే అమ్మవారిని ప్రత్యేక పూలు బంగారు ఆభరణాలతో అలంకరించి అభిషేకం, అర్చనలతో వరలక్ష్మి వ్రత పూజలు మొదలుపెట్టారు. పూజకు వచ్చిన భక్తులందరికీ గ్రామ ప్రజల సహకారంతో మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.