డా. ఎన్.టి.ఆర్ వైద్యసేవ ద్వారా ఉచిత కార్పోరేట్ వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయమని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు జగన్ మోహన్ రాజులు తెలిపారు. రాయచోటి పట్టణంలోని అమరావతి ఆసుపత్రి నూతన యాజమాన్య బాధ్యతలు డా. వాసుదేవ రెడ్డి, డా. మౌనికలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. జగన్ మోహన్ రాజు, లక్ష్మీ ప్రసాద్ రెడ్డి రిబ్బన్ కట్ చేశారు.