తంబళ్లపల్లెలో ఆదివారం ఉదయం నుంచి ఆకాశం మేఘామృతమై చిరు జల్లుల వర్షం కురుస్తోంది. వాతావరణంలో ఏర్పడిన మార్పులతో చిరు జల్లులు కురుస్తుండడంతో చలి పెరిగి జనాలను వణికిస్తోంది. చలితో ప్రజలు, చిరు బండ్ల వ్యాపారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సంక్రాంతి గర్భాల వర్షాలతో కూడిన చిరు జల్లులకు మెట్ట పంటలకు చీడ పీడలు సోకే ప్రమాదం ఉంటుందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.