రాష్ట్రంలో మెగా DSC నోటిఫికేషన్ విడుదలకు పాఠశాల విద్యాశాఖ చివరి దశ కసరత్తు జరుపుతోంది. వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయాలని లక్ష్యంగా ముందుకెళ్తోంది. SC వర్గీకరణ రోస్టర్ పాయింట్లపై గవర్నర్ ఆమోదించిన ఆర్డినెన్స్ ఆధారంగా టీచర్ పోస్టులు కేటాయించనున్నారని సమాచారం. ఆర్డినెన్స్ వెలువడిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. 16,347 టీచర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఏపీ సర్కార్.