AP: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో దారుణం జరిగింది. ఆళ్లగడ్డ రూరల్ ఎస్ఐ హరిప్రసాద్ వేధింపులు భరించలేక ట్రాక్టర్ డ్రైవర్ రవీంద్ర ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చాగలమర్రి టోల్ గేట్ దగ్గర ఇసుక ట్రాక్టర్‌ను పట్టుకుని స్టేషన్‌కు ఎస్ఐ హరిప్రసాద్ తరలించారు. ఈ సందర్భంగా రూ.20 వేలు ఇవ్వాలని ఎస్ఐ వేధించాడని, అందుకే విషయం తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో చెప్పారు. ట్రాక్టర్ డ్రైవర్‌ను పొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు.