తిరుపతి శ్రీనివాస నగర్‌కు చెందిన శ్రీదేవి సెల్ఫీ వీడియో ద్వారా తన సమస్యను CM దృష్టికి తీసుకెళ్లారు. ఆమె తన ఇంటిని YCP నేత భూమన అభినయ్ రెడ్డి స్నేహితుడు కృష్ణ చైతన్య యాదవ్ బలవంతంగా రాయించుకున్నాడని, అనంతరం మురళీ రెడ్డికి విక్రయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు వారంతా తన ఇంటిపైకి గుండాలతో వచ్చి దాడి చేశారని ఆరోపించారు. YCP నేతల నుంచి రక్షణ కల్పించాలని ఆమె CM, డిప్యూటీ CMలను వేడుకున్నారు.