TG: చిలుకూరు బాలాజీ ప్రధాన పూజారి రంగరాజన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డికి రాజేంద్రనగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.15 వేల రెండు పూచికత్తులు సమర్పించాలని ఆదేశించింది. కాగా రంగరాజన్‌పై దాడి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈఘటనపై సీఎం రేవంత్ విచారణకు ఆదేశించారు. దీంతో ఫిబ్రవరి 8న కేవీ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.