నల్లేరు గురించి ప్రస్తుతం చాలామందికి తెలియకపోవచ్చు. కానీ నల్లేరును పురాతన కాలంలో అనేక వ్యాధులకు మందుగా ఉపయోగించేవారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే కాల్షియం, విటమిన్ సి ఎముకల ధృడత్వానికి ఉపయోగపడుతాయని, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు దీనిని వంటలో ఉపయోగించుకుని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. అలాగే మహిళల్లో వచ్చే నెలసరి నొప్పులకు కూడా నల్లేరు బాగా పనిచేస్తుందని సూచిస్తున్నారు.