VIDEO: పోలీసుల ముందే నిప్పంటించుకున్న మహిళ

78చూసినవారు
యూపీలోని లక్నోలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ పోలీసుల ముందే నిప్పంటించుకుంది. తన సమస్యను పరిష్కరించాలని పోలీసుల కార్యాలయాల చుట్టూ తిరిగిన ఫలితం లేకపోవడంతో సహనం కోల్పోయింది. దీంతో లక్నోలోని సీఎం యోగీ ఆదిత్యనాథ్ కార్యాలయం బయట అందరూ చూస్తుండగానే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. పోలీసులు వెంటనే స్పందించి ఆమెను కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా  మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్