ఐపీఎల్ 2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌కు మొదటి ఓవర్లోనే షాక్ తగిలింది. హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ 4 పరుగులకు ఔట్ అయ్యారు. మొదటి ఓవర్లో వైభవ్ అరోరా వేసిన రెండో బంతికి హర్షిత్ రాణాకు క్యాచ్ ఇచ్చి హెడ్ పెవిలియన్ చేరారు. దీంతో తొలి ఓవర్ ముగిసేసరికి SRH స్కోర్ 6/1గా ఉంది. క్రీజులో అభిషేక్ శర్మ (1), ఇషాన్ కిషన్(1) ఉన్నారు.