AP: రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ఈ సమావేశం ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులుకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. అలాగే రాజధాని అమరావతిలో CRDA చేపట్టనున్న 22 పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని సమాచారం. అలాగే పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.