విశాఖలో రామానాయుడు స్టూడియోకు షోకాజ్ నోటీసులు

82చూసినవారు
విశాఖలో రామానాయుడు స్టూడియోకు షోకాజ్ నోటీసులు
AP: విశాఖలో రామానాయుడు స్టూడియోకు కేటాయించిన 35 ఎకరాల్లో 15.17 ఎకరాలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ భూముల్లో లేఅవుట్లు వేసి విక్రయించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం ఒక పనికి ఇచ్చిన భూమిని వేరే పనికి ఉపయోగిస్తే దాన్ని రద్దు చేయాలని సుప్రీం తీర్పు చెప్పింది. దీని ప్రకారం, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా, స్టూడియోకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్