విలాసవంతమైన భారీ క్రూయిజ్ షిప్ అలల తాకిడికి గురై ఊగిపోయింది. దీంతో అందులో ఉండే ప్రయాణికులు భయాందోళనకు గురై అరచేతిలో ప్రాణాలను పెట్టుకుని 48 గంటలు గడిపినట్లు ఓ ప్రయాణికుడు తెలిపాడు. వివరాల్లోకి వెళితే.. అట్లాంటిక్, పసిఫిక్, దక్షిణ మహాసముద్రాలు కలిసే 'డ్రేక్ పాసేజ్' అనే ప్రాంతంలో అలలు 40 అడుగుల ఎత్తు వరకు ఎగిపడుతుంటాయి. వాటి ఉధృతికి తట్టుకోలేక షిప్ భారీ కుదుపులకు గురైంది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వైరల్ అవుతోంది.