ఐపీఎల్ 2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తొలి వికెట్ కోల్పోయింది. రెండో ఓవర్లో కేకేఆర్ ఓపెనర్ డికాక్(1) ఔట్ అయ్యారు. రెండో ఓవర్లో ప్యాట్ కమిన్స్ వేసిన మూడో బంతికి జీషన్ అన్సారీకి క్యాచ్ ఇచ్చి డికాక్ పెవిలియన్ చేరారు. దీంతో ఓవర్ ముగిసేసరికి KKR స్కోర్ 14/1గా ఉంది. క్రీజులోకి అజింక్యా రహానే వచ్చారు.