అద్దంకి మండలం ఈ. ఓ. ఆర్. డి, చీరాల డివిజన్ ఇంచార్జ్ పంచాయతీ అధికారిగా హనుమంతరావు విధులను నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో ఆయన చూపిన ప్రతిభకు గాను, జిల్లా ఉన్నత అధికారులు ఆయనను ఉత్తమ సేవా పురస్కారానికి ఎంపిక చేశారు. ఆ నేపథ్యంలో గురువారం, బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో జరిగిన వేడుకల సందర్భంగా సంబంధిత పురస్కారాన్ని రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ వెంకట మురళి చేతుల మీదుగా అందుకున్నారు.