కొరిశపాడు మండలంలోని రైతులకు ఆయా గ్రామాలలోని రైతు భరోసా కేంద్రాల వద్ద సబ్సిడీపై కందులు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు ఆదివారం మీడియా ప్రకటన ద్వారా తెలిపారు. రైతులకు 33 శాతం రాయితీపై కందులు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కావున రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వ్యవసాయ శాఖ సిబ్బందిని సంప్రదించాలని శ్రీనివాసరావు కోరారు.