ఈనెల 26న జరగబోయే రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సందర్భంగా బాపట్ల పట్టణం ఏవివి హైస్కూల్లో గురువారం మండల ఎంఈఓ నిరంజన్ అధ్యక్షతన భారత రాజ్యాంగం, డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జై భీమ్ రావ్ భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు పర్రె కోటయ్య కొచ్చర్ల వినయ్ రాజు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.