మరమ్మత్తుల కారణంగా చిలకలూరిపేట పట్టణంలోని పలు ప్రాంతాలలో శనివారం తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని కమిషనర్ శ్రీహరిబాబు తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాగన్నపాలెం, సుభానినగర్, పురుషోత్తమపట్నం, మార్కెండేయ నగర్, భావానరుషి నగర్ పరిసర ప్రాంతాలకు పాక్షికంగా నీటిని విడుదల చేస్తామని, సదరు ప్రాంత ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు.