జిల్లా ఎస్పీ జిందాల్ ఆదేశాల మేరకు మంగళవారం జరిగే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో సోమవారం సాయంత్రం నుండి చీరాల నియోజకవర్గంలో 144వ సెక్షన్ అమల్లోకి వచ్చింది. హోటళ్ళు, సినిమాహాళ్లతో సహా అన్ని దుకాణాలను పోలీసులు మూయించేశారు. పాల కేంద్రాలు, మందుల షాపులకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. పట్టణ సీఐలతో సహా ఎస్సై లందరూ ప్రధాన కూడళ్ళలో సిబ్బందితో కలిసి పహరాకాస్తున్నారు. రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి.