తమిళనాడులోని సేలంలో జరిగిన దక్షిణ భారత అండర్ 17 బాలికల పవర్ లిఫ్టింగ్ పోటీలలో చీరాల ప్రభుత్వ మహిళా కళాశాల జూనియర్ ఇంటర్ విద్యార్థిని వేదశ్రీ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. గతంలో కూడా పాఠశాల స్థాయిలో వేదశ్రీ అనేక పతకాలు కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా శుక్రవారం రెడ్డి జన సేవా సమితి వేదశ్రీని సన్మానించింది. క్రీడా రంగంలో ప్రావీణ్యం ప్రదర్శిస్తున్న వేదశ్రీని వారు అభినందించారు.