కారంచేడులోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ మాజీ కోశాధికారి యక్కల రామ్మోహనరావుకి జైలు శిక్ష విధిస్తూ పర్చూరు న్యాయస్థానం మంగళవారం తీర్పునిచ్చింది. 2013 నుండి 2018 వరకు కోశాధికారిగా పనిచేసిన రామ్మోహనరావు ఆలయానికి చందాలుగా వచ్చిన సొమ్ములను స్వాహా చేసినట్లు ఫిర్యాదు అందగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసును విచారించిన న్యాయస్థానం నేరం రుజువు కావడంతో ఆయనకు రెండు నెలల జైలు శిక్ష విధించింది.