అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వేటపాలెంలోని ఆయన విగ్రహానికి ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆదివారం పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు ప్రాణార్పణ ఫలితంగానే తెలుగు వారు ప్రత్యేక రాష్ట్రాలను అనుభవిస్తున్నారని ఆయన చెప్పారు. అమరజీవి పట్టుదలను ప్రజలు స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని ఎస్సై కోరారు. శ్రీ వాసవి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.