తుళ్లూరు మండలం వెలగపూడి అసెంబ్లీలో బుధవారం గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్, స్పీకర్ అయ్యన్న మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. గుంటూరు బీఆర్ స్టేడియం అభివృద్ధిని విస్మరిస్తే ప్రజలు క్షమించరని ఎమ్మెల్యే నసీర్ అన్నారు. దీనికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రతిస్పందిస్తూ 'అయితే నిర్లక్ష్యం చేస్తే క్షమించరా' అని సరదాగా అన్నారు. దీనికి బదులిస్తూ 'ప్రజలు క్షమించరు సార్' అని నసీర్ అనగానే సభలో నవ్వులు విరిసాయి.