గుంటూరు జిల్లాలో ఈ నెల 28 నుంచి చేపట్టనున్న పశు గణన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ కత్తెరహెని క్రిస్టినా తన కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇటువంటి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. పశు సంవర్ధక శాఖ గుంటూరు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కెవివి సత్యనారాయణ పాల్గొన్నారు.