గుంటూరు: నందిగం సురేశ్ కు 14 రోజుల రిమాండ్

58చూసినవారు
మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను పోలీసులు సోమవారం మంగళగిరి కోర్టులో హాజరు పరిచారు. తుళ్లూరులో వృద్ధురాలు మరియమ్మకు సంబంధించిన కేసులో ఆయన రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. సురేశ్ కస్టడీ నేటితో ముగియడంతో పోలీసులు కోర్టుకు తీసుకువచ్చారు. న్యాయమూర్తి మాజీ ఎంపీ సురేశ్ కు మరో 14 రోజులు రిమాండ్ విధించడంతో తిరిగి ఆయనను పోలీసులు గుంటూరు సబ్ జైలుకు తీసుకువెళ్లారు.

సంబంధిత పోస్ట్