గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సోమవారం పలు రైళ్లను రద్దు చేసినట్లు సీనియర్ డీసీఎం ప్రదీప్ కుమార్ ఆదివారం తెలిపారు. రైలు నంబర్ 07464 (విజయవాడ-గుంటూరు), 07465 (గుంటూరు - విజయవాడ), 07755 (డోర్నకల్-విజయవాడ), 07756 (విజయవాడ-డోర్నకల్), 17201 (గుంటూరు-సికిం ద్రాబాద్) 17202 రైళ్లను సోమ, మంగళవారాలలో రద్దు చేసినట్లు తెలిపారు.