మహిళను బెదిరిస్తున్న వారిపై అరండల్ పేట పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం గుంటూరు-అమరావతి రోడ్డు కొండయ్య కాలనీకి చెందిన యామిని విజయవాడకు చెందిన వెంకటేశ్ వద్ద రూ. లక్ష అప్పుగా తీసుకొని ఫోన్ ద్వారా చెల్లించింది. వెంకటేష్ తో పాటు అతని కుటుంబ సభ్యులు రూ. 8 లక్షలు చెల్లించాల్సి ఉందని ఫోన్లు చేయడంతో పాటు బెదిరింపులకు గురిచేస్తున్నారని బాధితురాలు ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.