గుంటూరు: ఓటర్ల నమోదుపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

50చూసినవారు
గుంటూరు: ఓటర్ల నమోదుపై అవగాహన కల్పించాలి: కలెక్టర్
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నవంబరు 6వ తేదీ వరకు ఓటు నమోదు కోసం దరఖాస్తులను స్వీకరించటం జరుగుతుందని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. శాసన మండలి ఎన్నికలకు పాత ఓటర్ల జాబితాను పరిగణలోకి తీసుకోరని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరు వెంటనే ఓటరుగా నమోదు అయ్యేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రజలు అవగాహన కల్పించాలన్నారు. ఈమేరకు ఓటర్ల నమోదు, ఎన్నికల నిర్వహణపై మంగళవారం గుంటూరులో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

సంబంధిత పోస్ట్