విద్యుదాఘాతంతో మెడికల్ షాపు దగ్ధం

69చూసినవారు
విద్యుదాఘాతంతో మెడికల్ షాపు దగ్ధం
పిడుగురాళ్ల పట్టణంలోని వున్నం హాస్పటల్ ఎదురుగా వున్న సాయి మెడికల్ షాపులో ఆదివారం అర్ధరాత్రి విద్యుదా ఘాతంతో మంటలు చెలరేగాయి. షాపు యజమాని కూరపాటి మణికుమార్ రోజులాగానే 9 గంటలకు షాపు మూసివేసి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి 3 గంటల సమయంలో షాపు దగ్ధమవుతున్నట్లు విషయం తెలుసుకున్న మణికుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు.

సంబంధిత పోస్ట్