డేగల కుమార్ అకాల మరణం సిఐటియుకి తీరని లోటని సిఐటియు పూర్వపు పల్నాడు ఏరియా కార్యదర్శి ఏపూరి గోపాలరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిడుగురాళ్ల పట్నంలో డేగల కుమార్ సున్నం మిల్ , రైస్ మిల్ కార్మికుల సమస్యలపై పనిచేసారని, అదేవిధంగా ప్రజాశక్తి ఏజెన్సీ నిర్వహణలో ప్రముఖ పాత్ర పోషించారని, ఆమె ఆ స్థాయిలో పనిచేయటానికి డేగల కుమార్ ఆమెకు ప్రోత్సాహం ఇచ్చారని ఆయన శుక్రవారం అన్నారు.