మాచర్ల నియోజకవర్గ పరిధిలో సైబర్ నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం మాచర్ల రూరల్, పట్టణ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. నేరాల నియంత్రణపై తమ శాఖ అధికారులు, సిబ్బందికి సూచనలు చేశామన్నారు. ముఖ్యంగా సైబర్ క్రైమ్, గంజాయి వంటి చర్యలపై ఉక్కు పాదం మోపినట్లు తెలిపారు. గురజాల డీఎస్పీ జగదీష్, అధికారులు, సిబ్బంది ఉన్నారు.