నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మాచర్ల పట్టణంలోని తెలుగు బాప్టిస్ట్ చర్చ్‌లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో బుధవారం మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ పెద్దలు ఎమ్మెల్యేకి సాదర స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే భారీ కేక్ ను కట్ చేసి, ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖశాంతులతో జీవించాలని కోరుకున్నట్లు చెప్పారు.