పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలోని శిరిగిరిపాడు గ్రామం నందు గురువారం ఎమ్మార్వో షేక్ బాషా రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ సదస్సుకి హాజరైన రైతులకు రెవెన్యూ సదస్సు వలన జరిగే మేలును వివరించారు. అదేవిధంగా రైతుల భూ సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలో వివరించారు. భూ సమస్యలపై దరఖాస్తు చేసుకున్న వారికి 45 రోజులలోగా పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.