తాడేపల్లి: పోలీసుల అదుపులో రేప్ కేసు నిందితుడు

57చూసినవారు
తాడేపల్లిలో రేప్ చేసి తప్పించుకుని తిరుగుతున్న నిందుతుడిని అదుపులోకి తీసుకున్నామని మంగళగిరి నార్త్ డి. ఎస్. పి మురళికృష్ణ తెలిపారు. మంగళవారం, తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నిందితుడు తెంపర్ల రామరావుపై గతంలో కూడా దొంగతనం కేసులు ఉన్నాయన్నారు. కేసు నమోదైన 24 గంటల్లోనే ముద్దాయిని అరెస్ట్ చేసిన తాడేపల్లి సి. ఐ బి. కళ్యాణరాజు, సిబ్బందిని డి. ఎస్. పి అభినందించారు.

సంబంధిత పోస్ట్