నరసరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు ఆదేశాల మేరకు టీడీపీ నేతలు కోడెల శివప్రసాద్ స్టేడియం వద్ద గాల అన్న క్యాంటీన్ మరియు మార్కెట్ సెంటర్ వద్ద గాల అన్న క్యాంటీన్ లోని భోజన సదుపాయాలు మరియు పరిసరాల ప్రాంతాలలో శుభ్రతలను పరిశీలించారు. భోజనానికి వచ్చే ప్రతి ఒక్కరికి సరైన భోజనాన్ని అందించాలంటూ సూచించారు. ఈ కార్యక్రమంలో కొల్లి బ్రహ్మయ్య, తదితర టిడిపి నాయకులు పాల్గొన్నారు.